ఎన్టీఆర్ విషయంలో చాలా హ్యాపీ గా వుంది.
సినిమాలు చేయడంలో నిత్యామీనన్ చాలా డిఫరెంట్. నటనకు ప్రాధన్యత వున్న పాత్రలకే సైన్ చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడానికి ఇదీ ఓ కారణం. తెలుగు లో ‘సనాఫ్ సత్యమూర్తి’ తప్పితే మరో బడా సినిమా లేదు నిత్యా కెరీర్ లో. ఇప్పుడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఓ హీరోయిన్ గా చేస్తోంది నిత్యా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీ గా వుంది నిత్యా. ఈ సినిమా తన కోరిక తీరిందని చెబుతుందామె.
”ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో తన పాత్రకూ మంచి ప్రాధాన్యత వున్న సినిమా చేయాలన్నది నా కోరిక. ఆ కోరిక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో తీరింది.ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆ పాత్ర చేయడం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో మంచి రోల్ చేయాలనేది నా కోరిక. ఆ కోరిక జనతా గ్యారేజ్ తో తీరిపోయింది. ఎన్టీఆర్-కొరటాల శివల టీం తో పనిచేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్” అని చెప్పుకొచ్చింది నిత్యా.
భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకులముందు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈనెల 12న ఆడియో వేడుక జరుపుకోనుంది జనతా గ్యారేజ్.


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్