ఎన్టీఆర్ ఊరమాస్ : సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న జనతాగ్యారేజ్ న్యూ పోస్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి చేరుకోగా సినిమా ఆడియో వేడుక ఈ నెల 12 న జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుకని కన్ఫాం చేస్తూ దర్శకుడు కొరటాల శివ జనతాగ్యారేజ్ లోని కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశాడు.
కాగా ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేస్తుండగా సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం డబుల్ కూడా చేసిందని చెప్పొచ్చు. రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్ ఊరమాస్ యాటిట్యూడ్ తో పోస్టర్ తో పీక్స్ లో అంచనాలు పెంచాడు అని చెప్పొచ్చు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ తో పోల్చితే కొద్దిగా డల్ గా అనిపించింది అని కొందరు అంటున్నా ఎక్కువమందికి మాత్రం పోస్టర్ పీక్స్ లో నచ్చింది అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయట.
కాగా ఈ పోస్టర్ చూసి ఎలా ఉందో…మీరు ఏమని ఫీల్ అవుతున్నారో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి…..
లేబుళ్లు: ఎన్టీఆర్ ఊరమాస్



0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్