పోస్టర్స్ తో రచ్చ చేయడం నీకే చెల్లింది 'తారకరామ'
టాలీవుడ్ దాదాపు ప్రతీ టాప్ హీరో నటించిన సినిమాలు అవి విడుదల అయిన సమయంలో రచ్చ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య ఆ హీరోల్లో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పీక్స్ లో రచ్చ చేయడం కొత్తగా చూస్తున్నాం.
నాన్నకుప్రేమతో సినిమా నుండి ఈ క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ రాగా ఇప్పుడు జనతాగ్యారేజ్ తో పీక్స్ కి వెళ్ళింది అని చెప్పొచ్చు. జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతీ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేసింది.
లేటెస్ట్ గా ఆడియో రిలీజ్ వేడుక కోసం రిలీజ్ చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి. స్టిల్ రిలీజ్ అయిన ప్రతీసారి అవి ఇండియా లెవల్ లో ట్రెండ్ అవ్వడం ఈ మధ్య ఒక్క జనతాగ్యారేజ్ కే జరిగింది అని చెప్పొచ్చు.
ఒక సౌత్ సినిమాకి ఇన్నిసార్లు ట్రెండింగ్ ఉండటం ఈ మధ్య కబాలి కి తరువాత జనతాగ్యారేజ్ కే జరిగింది అంటున్నారు విశ్లేషకులు. కాగా ఇప్పుడు ఆడియో వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ లాంచింగ్ ఉండగా అది కూడా దుమ్ము రేపడటం ఖాయం అంటున్నారు.


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్