8, ఆగస్టు 2016, సోమవారం

ఎక్స్క్లూజివ్: మహేష్ బాబు లుక్ పై సస్పెన్స్ వీడింది


మహేష్ బాబు- మురుగాదాస్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ లుక్ పై బోలెడు చర్చ జరిగింది. కొత్త లుక్కు అంటూ కొన్ని అస్పష్టమైన ఫోటోలు కూడా హాల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడా సస్పెన్స్ కు తెరపడింది. ఈ సినిమాలో మహేష్ ఎలా వుంటారో అన్నదాని పై క్లారిటీ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని బయటికి వచ్చేశాయి. ఇందులో మహేష్ కనిపించాడు. కిర్రాక్ పుట్టించేలా వుంది మహేష్ లుక్కు. హెయిర్ స్టైల్ లో కూడా లైట్ చేంజ్ వుంది. గత సినిమా కంటే మరింత స్లిమ్ గా కనిపిస్తున్నాడు మహేష్.

అన్నట్టు.. రేపు అంటే ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు. పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా అపీషియల్ ఫస్ట్ లుక్ కూడా బయటికివచ్చే అవకాశం వుంది. ఈ సినిమా కి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే ప్రొడక్షన్ పేరుతో ఇప్పటివరకూ జరిగిన షూట్ కి సంబధించి ఎదో ఒక లుక్కును బయటికి వదిలే అవకాశం వుంది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్