‘కబాలి ఫైనల్ కలెక్షన్స్’ ఎంతో తెలుసా ?
సూపర్ రజనీకాంత్ ‘కబాలి’ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. విడుదలకి ముందు కబాలి క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కార్పోరేట్ కంపెనీల నుంచి కిల్లీ కొట్టు వరకు కబాలి క్రేజ్ ని ఫుల్ గా వాడుకొన్నాయి. ఇంతటీ భారీ అంచనాల మధ్య రిలీజైన కబాలి మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. అయినా.. కలెక్షన్లు పరంగా మాత్రం సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రివ్యూ, బెనిఫిట్ షోతోనే రికార్డ్ కలెక్షన్లకి తెరలేపింది కబాలి.
అయితే, తాజాగా కబాలి కలెక్షన్ల గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేరట్లలో కొనసాగుతున్న కబాలి, 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ కలెక్షన్స్ పై కబాలి చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ న్యూసే నిజమైతే.. కబాలి బాహుబలి రికార్డులని బ్రేక్ చేసినట్టే. బాహుబలి దేశ వ్యాప్తంగా రూ 550కోట్లకి పైగా వసూలు చేసింది. మరి.. ఇప్పుడు కబాలి కలెక్షన్ల విషయంలో చిత్రబృందం ఓ క్లారిటీ ఇస్తే.. రజనీ కబాలి బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ బ్రేక్ చేసిందా… ? లేదా ?? అనే విషయం చెప్పవచ్చు.
లేబుళ్లు: rajinikanths kabali box office collection rs 600 crore


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్