జనతాగ్యారేజ్ దెబ్బకు ఆ మూడు సినిమాల రికార్డు గల్లంతు
ఎక్కడ చూసిన జనతాగ్యారేజ్ గురించే చర్చలు జరుగుతున్నాయి, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని అభిమానులు మెచ్చే విధంగా కొరటాల శివ చూపించిన తీరు అందరిలోనూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా సినిమా ఆడియోకి ఆల్ టైం రికార్డు రేటు దక్కింది.
తెలుగులో ఇంతకుముందు పవన్ నటించిన కొమురంపులి మరియు బాహుబలి, నాన్నకుప్రేమతో లాంటి సినిమాల ఆడియో రైట్స్ సుమారు 1 కోటికి అమ్ముడై సంచలనం సృష్టించాయి. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న ఈ క్రేజీ సినిమాకి ఏకంగా బంపర్ రేటు తగిలింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జనతాగ్యారేజ్ ఆడియో రైట్స్ కి ఏకంగా 1.40 కోట్ల రేటు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఒక్క సినిమాతో మూడు సినిమాల రికార్డును బ్రేక్ చేసినట్లు అవుతుంది. మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
లేబుళ్లు: జనతాగ్యారేజ్ దెబ్బకు ఆ మూడు సినిమాల రికార్డు గల్లంతు


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్