ఎవరు ఏమనుకున్నా ఎన్టీఆర్-కొరటాల శివ ఇద్దరూ గ్రేట్ అంతే
కొరటాల శివ-ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. 2016 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా అందరూ అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.
కాగా ఈ మధ్యన ఎన్టీఆర్ మరియు కొరటాల గురించి మీడియాలో ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ ఇద్దరు రెమ్యూనరేషన్ పరంగా దాదాపు 32 కోట్లు తీసుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ 17 కోట్లు కొరటాల 15 కోట్లు తీసుకున్నారని అంటున్నారు….కానీ
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారట ఎన్టీఆర్ కొరటాల శివలు. ఈ నిర్ణయం ముందే తీసుకుని సినిమాకి పూర్తి స్థాయి బిజినెస్ జరిగిన తరువాతే తమ రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకున్నారట.
లేబుళ్లు: HatesOff Jr NTR & koratala siva


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్