9, ఆగస్టు 2016, మంగళవారం

T.F.I చరిత్ర తిరిగి రాయడానికి వస్తుంన్నాడూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో కనిపిస్తున్న మార్పుని చూసి మెచ్చుకొని వారు ఉండరు….ఒకప్పుడు కేవలం తన సినిమాల షూటింగ్ మరియు రిలీజ్ సమయంలో చేసే ప్రమోషన్ వరకే పరిమితం అయ్యే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కానీ మీడియాకి కానీ పెద్దగా టచ్ లో ఉండేవాడు కాదు.


అభిమానులు తననుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వారికోసం తన రూట్ ని మార్చుకునే పనిలో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు ఎన్టీఆర్.

షూటింగ్ సమయంలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వారు తననుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని తన సినిమాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారుతున్నాడు ఎన్టీఆర్. ఈ మార్పుని చూసి ఫ్యాన్స్ కూడా ఇన్నాళ్ళు మేము కోరుకున్నది ఇదే అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.


ఈ కొత్త పంథా నచ్చిన ఎన్టీఆర్ ఇకనుండి మరింతగా ఫ్యాన్స్ తో మమేకం అవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్ లో ఉంటూ వాళ్ళ కష్టాలు ఇష్టాలు తెలుసుకుని అందరిలో ఒకడిగా కావాలి అనేది ఎన్టీఆర్ ఉద్దేశ్యం అంటున్నారు విశ్లేషకులు. ఫ్యాన్స్ కూడా ఇదే మాకు కావాల్సింది అంటూ ఎన్టీఆర్ కి జైజేలు కొడుతున్నారు.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్