భర్త గురించి అనసూయ ఏం చెప్పింది
టాలీవుడ్ లో అనసూయ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ నుంచి సినిమాలోకి దూసుకొచ్చిన ఈ బుల్లితెర బాంబ్ ప్రతీ విషయంలోనూ వార్తల్లోకి ఎక్కేస్తుంది. గత నాలుగేళ్ల క్రితం స్కిన్ షోతో మొదలైన ఈ ముదురు యాంకర్ యవ్వారం ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయింది. సోగ్గాడే లో గెస్ట్ రోల్, క్షణం సినిమాలో పోలీసాఫీసర్ గా ఆమె చేసిన క్యారెక్టర్లు ఆమెను దృష్టిలో పెట్టుకునే రూపొందించామని చెప్పటం వెనుక ఆమె ప్రతిభ ఎంతుందో చెప్పకనే చెబుతోంది.
అలాంటి అనసూయ పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ సందర్భాల్లోనే ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలేవీ ఓకే చేయకపోయినా, వరుస ఫోటోషూట్ లతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా, తన పర్సనల్ విషయాలతోపాటు అభిరుచులను, కెరియర్ కబుర్లను ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
అసలు తాను అసలు కెమెరా ముందుకు వస్తానని ఏనాడూ ఊహించలేదంట. అంతా అనుకోకుండానే జరిగిపోయిందని చెబుతోంది. జబర్దస్త్ టీవీ షో తన లైఫ్ నే మార్చేసిందంటున్న ఈ హాట్ యాంకర్ ఆ దెబ్బకి వరుస టీవీషోలతో తన లైఫ్ టర్న్ అయ్యిందని వివరించింది. ముఖ్యంగా ఈ విషయంలో తన భర్త అందించిన సహకారం, కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహామే తనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పుకోచ్చింది. తనపై వస్తున్న కామెంట్లకు, వార్తలపై తన భర్త నవ్వి ఊరుకునేవాడని, లైట్ తీస్కోవాలని తనకు సూచించేవాడని చెప్పింది. చివరగా స్విమ్మింగ్, సింగింగ్, డాన్సింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన అనసూయ రైఫిల్ షూటింగులో తానెంతో షార్ప్ అంటోంది. మరి తర్వాతి చిత్రం ఎప్పుడు అంటే మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుతోంది.
లేబుళ్లు: Anasuya comments on her husband


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్