‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నుండి దేవి అవుట్..?
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా, వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. యావత్ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
ఈ చిత్రానికి మొదటగా దేవి శ్రీ ప్రసాద్ ను అనుకున్నారు. కానీ దేవి శ్రీ ఈ చిత్రం తో పాటు మరో రెండు మెగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ మధ్య తన అమెరికా లైవ్ ఇన్ కాన్సర్టుల సంగతి చూసుకోవడంతో శాతకర్ణి కు పాటలు కంపోజ్ చేయడం లేట్ అవుతోందట. సంక్రాంతి 2017కు ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్న బాలయ్య కు దేవి పెద్ద తలనొప్పిగా మారాడట . పాటల్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి త్వరగా పాటలు సమకూర్చాలని దేవి తో చెప్పడం తో మనోడు చేతులెత్తాశాడట. ఫాస్ట్ గా అయితే ఆ ఫీల్ లో సాంగ్స్ రావని చెప్పడం తో , ఇప్పుడు క్రిష్ కొత్త మ్యూజిక్ డైరక్టర్ కోసం వెతుకుతున్నాడనే సమాచారం.
గతంలో క్రిష్ ‘కంచె’ సినిమాకు కంపోజ్ చేసిన చిరంతన్ బట్ దగ్గర పాటలు తీసుకుని.. మణిశర్మతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుగుతుంది.
లేబుళ్లు: Devi out Gautamiputra satakarni


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్