ఫస్ట్ టైం.. చైతూ క్లారిటీ ఇచ్చాడు
ఫస్ట్ టైం చైతూ క్లారిటీ ఇచ్చాడు. అలాగని సమంతతో ప్రేమ-పెళ్లి విషయాలపై చైతూ ఏమైనా నోరు తెరిచాడా.. ? అని ఆశపడకండీ.. ! ప్రస్తుతం చైతూ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇందులో ఒకటి ‘ప్రేమమ్’ కాగా, మరొకటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’. అయితే, కొన్నాళ్లుగా ఈ చిత్రాల రిలీజ్ విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. తాజాగా, ఈ వార్తలపై చైతూ స్పందించాడు. తాను చెప్పేవరకు రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి వార్తలు నమ్మొద్దని ప్రేక్షకులకి తెలియజేశాడు.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమమ్’ సెప్టెంబరులో విడుదల అవుతుందని, ఆడియో ఆగస్టులోనే రిలీజ్ అవుతుందని.. కచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తారని తెలిపాడు ట్విట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం విడుదల కూడా ఈ నెలలోనే ఉండొచ్చని టాక్. ఈ చిత్రంపై చైతూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి.. లవ్ మేటర్ పై ఎంత రాద్దాంతం జరుగుతున్ననోరు మెదపని సినిమాల విషయంలో మాత్రం కాస్త క్లారిటీ ఇచ్చాడు. మరి.. పెళ్లి విషయంలో క్లారిటీ ఎప్పుడిస్తాడో ?
లేబుళ్లు: Naga chaitanya gives clarity on his releasing films


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్