‘బాలకృష్ణ’గా నటిస్తున్న కళ్యాణ్ ?
‘పటాస్’తో సూపర్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు పూరి జగన్నాధ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా కోసం ‘రిపోర్టర్ బాలకృష్ణ’ అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం. మీడియా చుట్టూ తిరిగే కథ ఇది. కల్యాణ్ రామ్ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తాడు. అతని పేరు బాలకృష్ణ అని.. ఈ సినిమాకి అదే పేరు పెడితే బాగుంటుందని పూరి భావిస్తున్నాడట.జులై 5 కల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా ప్రకటిస్తారని సమాచారం.
లేబుళ్లు: kalyanram


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్