నయన్ చేతిలో బన్నీకి ఘోర అవమానం !
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ని నయన తార ఘోరంగా అవమానించింది. కాస్త ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటనపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ ‘సైమా అవార్డ్స్’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దక్షిణాది నటులతో సైమా వేదిక కళకళలాడింది. ‘నేనూ రౌడీ’ చిత్రానికి గానూ.. తమిళ్ వర్షన్ ఉత్తమ నటిగా నయన్ ఎంపికైంది. అవార్డుని అందించేందుకు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ వేదికపైకి ఆహ్వానించారు నిర్వాహకులు. తీరా అవార్డు అందుకొనేందుకు స్టేజ్ పైకి వచ్చిన నయన్ షాకిచ్చింది. అవార్డ్ ని విఘ్నేష్ చేతుల మీదుగా అందుకోవాలని ఉందని.. ఆయనని స్టేజ్ పైకి ఆహ్వానించి అవార్డుని స్వీకరించింది. ఆ టైం.. బన్నీని ఎలాంటి రిక్వెస్ట్ కూడా చేయలేదు. దీంతో.. బన్నీకి కాలిందట. అలాంటి కోరిక ఉంటే ముందే నిర్వాహకులు చెప్పాలని గానీ.. తీరా స్టేజ్ పైకి వచ్చాక ఎకిలి చేష్టలు చేయడం ఏంటని.. బన్నీ తరుపున వారు నిర్వాహకులను ప్రశ్నించారట. ఆ విషయం తమకు కూడా తెలియదని నిర్వాకులు సమాధానం చెప్పడం విశేషం.
లేబుళ్లు: #Nayanatara Insults bunny


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్