‘కబాలి’ని కత్తిరించారు..
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’పై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ‘కబాలి’ తరచూ వాయిదా పడుతుండటం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తాజాగా, ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ… కబాలి ఉత్తర భారత హక్కుల్ని పొందింది. బాలీవుడ్ రిలీజ్ తో పాటు… ఓవర్సీస్ విడుదల హక్కులు సైతం ఈ సంస్థకే దక్కాయి. దీంతో.. ఈ నెలలోనే ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారెంటీ అంటున్నారు. జులై 15 లేదా 22న కబాలి రిలీజ్ ఉండొచ్చని చెబుతున్నారు. ఇక, కబాలి రన్ టైం విషయంలోనూ చిత్రబృందం పక్కాగా ఉంది. రజనీ గత సినిమాల్లా నివిడి దాదాపు 3 గం॥లు కాకుండా 2.30ని॥ల నివిడితోనే కబాలిని రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం సెన్సార్ లో భారీగా కత్తెరపెట్టనున్నట్ట సమాచారమ్. మొత్తానికి.. ఇప్పుడున్న కబాలికి కత్తెర పడటం ఖాయంగా కనిపిస్తోంది
లేబుళ్లు: ‘కబాలి’ని కత్తిరించారు..


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్