ఫస్ట్ లుక్: షేక్ చేస్తున్న పూరి-కళ్యాణ్ 'ఇజం'
కమ్యూనిజం.. హ్యూమనిజం.. ఇలా చాలా 'ఇజం'లే ఉన్నాయి. మనకు టాలీవుడ్ లో పవనిజం కూడా ఉందిలే. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్ మాత్రం.. తన ఇజం ఏంటో చూపిస్తా అంటున్నాడు. కొత్త లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ను లాంచ్ చేస్తూ.. ''ఇజం'' సినిమా తొలి పోస్టర్ ను విడుదల చేశాడు ఈ దర్శకుడు.
అసలు ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ ఎన్నడూ లేనంత పోష్ అండ్ అర్బన్ లుక్ లో ఇరగదీస్తూ ఈ సినిమా పోస్టర్ పై కనిపించడమే చాలా కొత్తగా ఉంది. పైగా మనిషేమో అంత పోష్ గా ఉండి.. చివరకు బీడి కాల్చడం కాస్త వెరైటీగానే ఉందిలే. అదే ఇజం అంటారేమో మరి. ఇకపోతే పోస్టర్ మీదున్న స్లోగన్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. 'ఇతగాడిని అరెస్టు చేయొచ్చు.. కాని అతడి ఐడియాలను అరెస్టు చేయలేరు' 'ఇతను చాలా స్పెషల్. చంపేయడానికి అతని దగ్గర ఒక కథ ఉంది' అంటూ చాలా కొత్తగా ప్రయత్నించాడు పూరి.
కళ్యాణ్ రామ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో మిస్ ఇండియా బ్యూటి అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి పూరి తీస్తున్న ఈ ''ఇజం'' సక్సెసిజం బాట పట్టాలని ఆశిద్దాం.
లేబుళ్లు: ISM FIrst Look Telugu NEWs, Kalyan Ram, Puri Jagannath ISM Movie


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్