4, జులై 2016, సోమవారం

‘చైతూ-సమంత’ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. !


‘చైతూ-సమంత’ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. !



కొన్నాళ్లుగా టాలీవుడ్ లో అక్కినేని యంగ్ హీరోల లవ్ స్టోరీస్ హాట్ టాపిక్ గా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం ఏపీసోడ్ పీక్ స్టేజ్ కి చేరుకోకాగానే.. అఖిల్ అక్కినేని బాంబు పేల్చాడు. అల్రెడీ లవ్ లో ఉన్నానని షాక్ ఇచ్చాడు. ఇంతలో అఖిల్ లవ్వర్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జరిగింది. తనయుల ప్రేమాయణంపై స్పందించిన నాగ్.. త్వరలోనే పెళ్లి కబురు చెబుతా అన్నట్టు సంకేతాలిచ్చేశాడు. అయితే, అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారమ్ ప్రకారం.. అక్కినేని హీరోల పెళ్లిళ్లు ఈ యేడాది డిసెంబర్ లో జరగనున్నాయట. చైతూ, అఖిల్ ల పెళ్లిన ఒకేరోజు, ఒకే టైం కి అంగరంగ వైభవంగా జరిపించాలని నాగ్ డిసైడ్ అయినట్టు సమాచారమ్. ఈ పెళ్లిళ్లకు దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రముఖులందరూ హాజరయ్యేలా అన్నపూర్ణ స్టూడియో వివాహ వేదికని ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి.. తనయుల ప్రేమ పెళ్లిలను అంగీకరించిన నాగ్.. ఘనంగా పెళ్లిళ్లు చేయడానికి రెడీ అవ్వతున్నాడన్న మాట. ప్రస్తుతం నమో: వెంకటేశాయ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాగ్. ఈ సినిమా పూర్తవ్వగానే తనయుల పెళ్లి పనులపై పడనున్నట్టు తెలుస్తోంది.




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్