11, మార్చి 2017, శనివారం

ఆకట్టుకుంటున్న బాహుబలి పిక్


దర్శకుడు ధీరుడు రాజమౌళి తన సినిమాల్లో పాత్రలు పండించే ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. బాహుబలి పార్ట్ 1 విషయంలోనూ అలాంటి ఎమోషన్స్ తోనే పాత్రలు రూపొందించాడు రాజమౌళి. దానికి విజువల్ ఎఫెక్ట్స్ తోడవ్వడంతో  సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. ఇక, ఈ సినిమాలో రాజమౌళి ప్రేక్షకులలో మిగిల్చిన ఓ పెద్ద సస్పెన్స్ బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు ? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ప్రేక్షకులు  దాదాపు రెండేళ్లుగా బాహుబలి 2 కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా హడావుడి మొదలైంది. ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపు ఈ నెల 16న బాహుబలి ట్రైలర్, ఈ నెలాఖరున బాహుబలి 2 ఆడియో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో.. బిగ్ సస్పెన్స్ ని గుర్తు చేసేలా ఓ పోస్టర్ ని వదిలాడు రాజమౌళి.


బాహుబలి ఎండింగ్ లో కట్టప్ప బాహుబలిని కత్తితో పొడిచే పోస్టర్ కి పైనా.. బాహుబలి పసిపాపగా ఉన్న టైంలో కట్టప్ప ఎత్తుకొని ముద్దు చేస్తున్న పిక్ తో డిజైన్ చేశాడు. ఇది రాజమౌళి మార్క్ పోస్టర్ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో.. బిగ్ సస్పెన్స్ ఏంటని తెలుసుకొనేలా పోస్టర్ ని క్రియటివ్ గా వదిలాడు జక్కన్న. ఇప్పుడీ పోస్టర్ ని చూసి ప్రేక్షకులు మురిసిపోతున్నారు. ఇక, ఈ నెల 16న రిలీజ్ కానున్న బాహుబలి 2 ట్రైలర్ తో.. ప్రమోషన్స్ పీక్స్ కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది

లేబుళ్లు: , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్