ఎన్టీఆర్‌కి బాలకృష్ణ ఇన్‌డైరెక్ట్ మెసేజ్
సినిమా ముహూర్తం జరగడానికి ముందుగానే విడుదల తేదీ ప్రకటించడం, చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయడం పూరి జగన్నాథ్ స్పెషాలిటీ. హీరోలని బాగా ప్రెజెంట్ చేస్తాడనే దానికి తోడు అతడి వేగమే పూరిని స్టార్ హీరోలకి ఫేవరెట్ డైరెక్టర్ని చేసింది. బాలకృష్ణతో తొలిసారిగా సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో సంచుల కొద్దీ పంచ్లేస్తానని అంటున్నాడు. డైలాగ్ సిడి రిలీజ్ చేసుకునేటన్ని డైలాగులు ఇందులో వుంటాయని చెప్పాడు.
ఇదిలావుంటే దసరాకి విడుదల చేస్తామని ముందే ప్రకటించడాన్ని అంతా మెచ్చుకుంటున్నారని, తర్వాత ఎవరూ పోటీకి రాకుండా వుండడానికి బాగుంటుందని ఈ సినిమా ముహూర్తం సందర్భంగా పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలకి వేరే చిత్రాలు పోటీగా రావడంతో ఈసారి ముందుగానే ప్రకటిస్తున్నామని మిగతా నిర్మాతలకి అన్యాపదేశంగా చెప్పారు. అయితే దసరా బరిలోకి ఖచ్చితంగా వస్తుందని అనుకుంటోన్న ఎన్టీఆర్ మలి చిత్రానికే ఈ విధంగా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవకుశ' దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అందుకే ముందుగా మేమే రిజర్వ్ చేసుకున్నామని, తర్వాత పోటీకి రావడం సబబు కాదని అన్నట్టుగా సంకేతాలు పంపించారు. మరి దసరా బరిలోకి అబ్బాయ్ కూడా దిగితే కావాలనే బాబాయ్‌ని ఇబ్బంది పెడుతున్నాడనే అపవాదులొచ్చే అవకాశాలు కూడా వుంటాయి కనుక దీనిని లవకుశ టీమ్ ఎలా డీల్ చేస్తుందో?
లేబుళ్లు: Bala krishna, Ntr


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్