6, మార్చి 2017, సోమవారం

బాలయ్య కోసం లొకేషన్ మార్చేశాడా?


నందమూరి బాలకృష్ణ- పూరీ జగన్నాధ్.. ఈ కాంబినేషన్ వింటేనే క్రేజీగా ఉంది. లెంగ్తీ డైలాగ్స్ తో ఇరగదీసే బాలయ్య.. చిన్నచిన్న మాటలతో చితక్కొట్టే పూరీల కాంబో ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్న ఈ చిత్రం కోసం.. పూరీ తన టేస్ట్ ను మార్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

సహజంగా పూరీ సినిమాల్లో ఫారిన్ లొకేషన్స్ అంటే ఎక్కువగా బ్యాంకాక్ కనిపిస్తుంది. బాలకృష్ణ సినిమా కోసం ఫారిన్ లో షూట్ ప్లాన్ చేసిన పూరీ జగన్నాధ్.. ప్లేస్ మాత్రం బ్యాంకాక్ నుంచి షిఫ్ట్ చేశాడు. ఈ సారి ఇంగ్లాండ్ లో పిక్చరైజ్ చేయబోతున్నాడట పూరీ. కొంత భాగం.. పాటలు మినహాయిస్తే దాదాపుగా సినిమా అంతా ఇక్కడే సాగనుందని టాక్. స్టోరీ బేస్ కూడా ఇంగ్లండ్ దే ఉంటుందిట. అలాగే అక్కడి లొకేషన్స్ కూడా ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతాయంటున్నారు.

త్వరలో హైద్రాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ రెండో వారంలో మొత్తం యూనిట్ అంతా ఇంగ్లండ్ బయల్దేరనున్నారట. అక్కడ నాలుగు వారాల షూటింగ్ లో ప్రధాన భాగం అంతా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం తర్వాత.. 101వ సినిమాను బాలయ్య చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ కావడంతో.. అభిమానుల్లోనూ బోలెడంత ఆసక్తి కనిపిస్తోంది.

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్