ఎన్టీవోడి దమ్ము ఇది… జై లవ కుశకు కళ్లు చెదిరే డీల్
యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటనేది ఆయన చివరి మూడు చిత్రాలే చెపుతాయి. వరుస ప్లాపుల తర్వాత ఎన్టీఆర్ చేసిన టెంపర్ – నాన్నకుప్రేమతో -జనతా గ్యారేజ్ సినిమాలు మూడూ సూపర్ హిట్ అయ్యాయి. గ్యారేజ్ ఏకంగా టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
గ్యారేజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ పవర్ డైరెక్టర్ కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో నటిస్తోన్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాను గంపగుత్తగా కొనేసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట. మొత్తంగా ప్రపంచవ్యాప్త ధియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపేసి 85 కోట్లకు అడిగినట్లు తెలుస్తోంది. గ్యారేజ్ రూ.83 కోట్ల వరకు షేర్ తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు రూ.85 కోట్లు ఇస్తానని ఆ నిర్మాత ముందుకు వచ్చాడట. అవసరమైతే మరో రూ.5 కోట్లు అయినా ఇస్తానని కళ్యాణ్‌ను అప్రోచ్ అయ్యాడట. దీనిని బట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో తెలుస్తోంది.
గతంలో తన సినిమాలు కొని నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమాను ఇవ్వాలని కళ్యాణ్ డిసైడ్ అవ్వడంతో ఈ భారీ డీల్‌ను కళ్యాణ్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి కళ్యాణ్‌రామ్ కమర్షియల్ లెక్కల కన్నా…మానవత్వానికి ఎంత విలువ ఇస్తాడో అర్థమవుతోంది.
లేబుళ్లు: Jai Lavakusa, NTR 27, Telugu news


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్