2, మార్చి 2017, గురువారం

త్వరలోనే శృతి పెళ్లి పీటలు ఎక్కబోతుందా..?

గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ..సినిమాల ఎంపిక లోనే కాదు తన పర్సనల్ విషయాలలో కూడా చాల కొత్తగా ఆలోచిస్తుంది..ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రెండో సారి నటించే ఛాన్స్ కొట్టి , పవన్ రికార్డు ను సృష్టించిన ఈమె , ఈ మధ్య ఓ ఇటాలియన్ కుర్రాడు మైకేల్ కోర్సల్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే..ఆ తర్వాత ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది శృతి. తాజాగా మరోసారి శృతి – మైకేల్ కోర్సల్ పెళ్లి ఫై వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా కమల్ హాసన్ లండన్ పర్యటన సందర్భంగా మైఖేల్ ఆయన వెంట కనిపించడంతో వీరిద్దరి పెళ్లి గురించి కమల్ చర్చలు జరుపుతున్నాడని, ఇప్పటికే వీరిద్దరితో మాట్లాడాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. యూకే – ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్-2017 లో పాల్గొనడానికి కమల్ హాసన్ లండన్ వెళ్లాడు. ఈ కార్యక్రమంలో కమల్ వెంట మైఖేల్ కొర్సేల్ కనిపించడం తో ఈ వార్తల్లో నిజం ఉందని అంత నమ్ముతున్నారు. మరి అసలు వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్