2, మార్చి 2017, గురువారం

తాను గర్భవతినని డిక్లేర్ చేసిన తెలుగు యాంకర్!


‘అమ్మ’దనంలో ఉండే ‘కమ్మ’దనం అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు గృహిణులు. అలాంటి అనుభూతులను చవిచూడడానికి వివాహమైన ప్రతి మహిళా ఎదురుచూస్తుంటుంది. ఇందుకు ఐశ్వర్యారాయ్ అయినా ఒకటే… సామాన్య మహిళ అయిన ఒకటే. ఇలాంటి అనుభూతి కోసమే తానూ ఎదురుచూస్తున్నాను అని తెలుగు టెలివిజన్ యాంకర్ శ్యామల అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “తాను అయిదు నెలల గర్భవతినని, మరో నాలుగు నెలల సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, తాను డెలివరీ అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు యాంకరింగ్ కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని, ఒకవేళ అబ్బాయి పుడితే ఇషాన్ అనే పేరును పెడతానని, అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదని” చెప్పుకొచ్చింది.

ఆరేళ్ళ క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్న శ్యామల, ప్రస్తుతం బుల్లితెరకు సంబంధించి బిజీ యాంకర్. పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు, సినీ ఆడియో వేడుకల పైన కూడా సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్యామల నెటిజన్లకు కూడా సుపరిచితమే. ఈ సందర్భంగా శ్యామలకు శుభాకాంక్షల వెల్లువలు వస్తున్నాయి

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్