మెదక్ జిల్లాలోని ఆ ఊరంతా వేశ్యలే
ఇప్పటివరకు ఆ ఊరి గురించి ఎవ్వరికి పెద్దగా తెలియదు. అయితే గతరాత్రి నుంచి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఆ ఊరు ఎక్కడో లేదు…తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన అవిభాజ్య మెదక్ జిల్లాలో ఉంది. ఆ ఊరుపై పడిన పెద్ద చెడ్డ ముద్రను ఇప్పుడు ఆ గ్రామస్తులతో పాటు జిల్లా వాసులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం జప్తిశివనూరు అన్నది ఓ చిన్న గ్రామం. ఇంతకాలం ఎవరికి పెద్దగా పట్టని ఈ ఊరు.. ఇప్పుడు అందరి దృష్టిలో పడింది. గత రాత్రి ఆ గ్రామానికి పోలీసులు ఏకంగా మూడు బస్సులు, 20 కార్లలో వెళ్లి సోదాలు చేశారు. అక్కడేమి ఉగ్రవాదులు లేరు…మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఊరు కూడా కాదు..మరి ఆ ఊళ్లో ఎవరున్నారు..?
గత రాత్రి జప్తిశివనూరులో భారీ ఎత్తున తనిఖీలు చేసిన పోలీసులు ఏకంగా 150 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఓ పెద్ద సంచలనంగా మారింది. పోలీసులు భారీ ఎత్తున మఫ్టీలో అక్కడకు చేరుకున్నారు. చాలా ఇళ్లల్లో దాడి చేసి భారీ ఎత్తున సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ భారీ దాడుల వెనుక ఉన్న కారణం ఏమిటి? అయినా ఇంత చిన్న ఊళ్లో.. అంత పెద్ద సెక్స్ రాకెట్ ఏమిటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు బయటకు రావాల్సి ఉంది. ఊళ్లో అందరూ కాకపోయినా ఏకంగా 150 మంది సెక్స్‌వర్కర్లు దొరకడంతో ఇప్పుడు తెలంగాణలో జప్తిశివనూరు వేశ్యల ఊరుగా మార్మోగుతోంది.
లేబుళ్లు: japti sivanoor, Telangana police


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్