4, మార్చి 2017, శనివారం

ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినా రవితేజ


మాస్ మహారాజా రవితేజ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడంపై స్పందించారు. స్క్రిప్ట్ కుదిరితే తాను తప్పకుండా ఎన్టీఆర్‌తో నటిస్తానని తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తే చూడాలని ఉందని ఒక అభిమాని సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రవితేజ సమాధానిమిచ్చారు. అయితే మల్టీస్టార్ మూవీలో ఏ హీరోతో నటించడం ఇష్టమని మరో అభిమాని అడగ్గా తాను ఏ హీరోతో అయినా కలిసి నటించడానికి సిద్ధమని తెలిపారు.తారక్ తో కలిసి నటించే చాన్స్ వస్తే మాత్రం వదులకోను అని అన్నారు.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదన్న ప్రశ్నక స్పందిస్తూ ఖచ్చితంగా ఇడియట్ అని చెప్పారు రవితేజ.

ఇప్పుడు ఎన్టీఆర్, రవితేజ లు కూడా కథలు మార్చుకొన్నారు. ఆ రెండు చిత్రాలు కూడా ఒకే టైం సెట్స్ పైకి వెళ్తుండటం విశేషం. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చాలా కథలని విన్న ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఈ కథని ఇంతకు ముందే రవితేజని వినిపించాడట బాబీ. రవితేజ కి కూడా కథ బాగా నచ్చేసింది. ఎందుకో తెలీదు కానీ.. రవితేజతో క్యాన్సిల్ అయ్యింది.

ఇదే కథకి స్వల్ప మార్పులు చేర్పులు చేసి ఎన్టీఆర్ కి వినిపించాడు బాబీ. ఆ కథ తారక్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. త్రి పాత్రాభినయం.. అందులోనే నటనకి స్కోప్ ఉండటంతో తారక్ బాబీ కథని తీస్తున్నాడు.

మరోవైపు, మాస్ మహారాజ రవితేజ దర్శకుడు అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే అనిల్ రాఘవపూడి ఎన్టీఆర్ కి ఓ కథ వినిపించాడు. అది తారక్ కి కూడా నచ్చేసింది. వీరి కలయికలో ఓ చిత్రం రానుందనే ప్రచారం జరిగింది. అయితే, ఆఖరి నిమిషయంలో ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడితే కథతో రవితేజతో సినిమా చేసేందుకు అనిల్ రాఘవపూడి రెడీ అయ్యాడు. ఇవాళ రోపో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుది.

మొత్తానికి.. రవితేజ కథతో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కథతో రవితేజ సినిమాలు చేస్తున్నారు. అది కూడా ఒకే టైంలో. మరీ.. వీరిలో ఎవరి కథ, ఎవరి సినిమా హిట్ అవుతుందో చూడాలి. అది చూడాలంటే కొద్దిరోజుల పాటు వెయిట్ చేయాలి.

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్