6, మార్చి 2017, సోమవారం

ఖైదీ వ‌సూళ్ల‌పై చెర్రీ నిన్నోమాట‌….నేడో మాట‌..!


మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ సినిమా వ‌సూళ్ల విష‌యంలో రాంచ‌ర‌ణ్ ర‌క‌రాల లెక్క‌ల‌తో అంద‌రిని గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాడ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ సినిమా వ‌సూళ్ల విష‌యంలో ముందునుంచి చాలా అత్యుత్సాహంతో వ్య‌హ‌రించారు. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి క‌లెక్ష‌న్ల లెక్క‌లు చెప్పారు.
తొలి రోజే ఖైదీ ఏకంగా రూ. 47 కోట్లు కొల్ల‌గొట్టింద‌న్నారు. ఆ త‌ర్వాత రూ. 105 కోట్ల షేర్ అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం చెర్రీ ఐటీ అధికారుల‌కు ఇచ్చిన లెక్క‌ల్లో ఖైదీ రూ. 75 కోట్ల‌కు ద‌రిదాపుగా వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని లెక్క‌లు చూపార‌న్నారు. ఇక ఈ సినిమా రీసెంట్‌గా 53 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది.
ఈ సినిమా 54వ రోజు పోస్టర్ ను ఇచ్చిన చరణ్.. అందులో గ్రాస్ వసూళ్ల వివరాలను వెల్లడించడం విశేషం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 164 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ.. కలెక్షన్స్ వివరాలను ప్రకటించాడు చెర్రీ. ఇక సింగిల్ లాంగ్వేజ్ సినిమాగా చూస్తే ఖైదీ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాగా కూడా ప్ర‌క‌టించుకున్నారు.
ఇక ఇక్క‌డే ఈ సినిమా క‌లెక్ష‌న్లలో ఏవి నిజ‌మ‌ని న‌మ్మాలో కూడా తెలియ‌క చాలా మంది డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఐటీ లెక్క‌లకే ఖైదీ వ‌సూళ్లు డ‌ల్ అయ్యాయి. అప్పుడు రూ. 75 కోట్లు చూపిస్తే ఆ త‌ర్వాత రూ. 164 కోట్లు ఎలా వ‌చ్చాయో కూడా ఎవ్వ‌రికి అర్థం కావడం లేదు. మ‌రో ప‌క్క షేర్ రూ.105 కోట్లంటున్నారు. ఐటీ లెక్క‌ల త‌ర్వాత రూ. 30 కోట్లు షేర్ ఈ సినిమాకు వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. దీంతో ఖైదీ వ‌సూళ్ల లెక్క‌ల విష‌యంలో అస‌లేం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్