10, మార్చి 2017, శుక్రవారం

బాల‌య్య – పూరి సినిమాలో ఆ హీరో గెస్ట్ రోల్


యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌య్య త‌న 101వ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో గురువార‌మే ప‌ట్టాలెక్కించాడు. శాత‌క‌ర్ణి లాంటి చారిత్రక సినిమా తర్వాత ఇప్పుడు తన ట్రేడ్ మార్క్ పూర్తి మాస్ మసాలా సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.
బాల‌య్య – పూరి కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే సినిమాపై ఎక్క‌డా లేని భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో ఉండే హైలెట్స్ అప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈ సినిమాలో డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంటాయ‌ట‌. బాల‌య్య కేరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ అని చెప్పుకునే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌ను బాల‌య్య కోసం పూరి రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాల‌య్య లుక్ కూడా చాలా కొత్త‌గా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రో ముఖ్య‌మైన హైలెట్స్ ఏంటంటే యంగ్ హీరో సుధీర్ బాబు గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడట. సుధీర్ రోల్ ఎంత సేపు ఉంటుంద‌న్నది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇక బాల‌య్య ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నారు.
వీరిలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం న‌య‌న‌తార – త‌మ‌న్నా – అనుష్క – కాజ‌ల్ పేర్లు వినిపిస్తున్నాయి. పోకిరి సినిమా కోసం ఎంత కసిగా పనిచేశాడో మళ్ళీ ఆ స్థాయి కసితో పూరి ప‌ని చేస్తున్నాడ‌ట‌. ఇక సెప్టెంబ‌ర్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు పూరి అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసేశాడు.

లేబుళ్లు: , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్