లాభాల్లో బాలయ్య సినిమా
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తాజాగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 35 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అందులో 10 కోట్ల రూపాయలను బాలయ్యకు పారితోషికంగా ఇస్తున్నారట, మిగిలిన 25 కోట్ల రూపాయలతోనే పూరి తన పారితోషికంతో పాటు సినిమా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది.
అంతేకాదు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైతే పూరి తన పారితోషికం నుంచి తగ్గించుకోవాలనే కండీషన్ కూడా ఉన్నట్లు సమాచారం. దాంతో సినిమాని కేవలం 15 కొట్లలో పూర్తి చేసి 10 కోట్ల పారితోషికం తను తీసుకోవాలని పూరి భావిస్తున్నాడట. ఇలాంటి విషయంలో పూరి జీనియస్ అయినా.... బాలయ్య వంటి స్టార్ హీరోతో సినిమాకి అంత తక్కువ బడ్జెట్ అంటే క్వాలిటి తగ్గుతుందేమో అని అభిప్రాయపడుతున్నారు పలువురు.
కానీ, ఏదేమైనా మొత్తంగా 35 కొట్లలో పూర్తి చేస్తే అది సేఫ్ జోన్ అని లాభాలు వస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ తో బాలయ్య సినిమా ఎలాగోలా 40 కోట్ల రూపాయలకు అమ్మకం జరుగుతుందని, అలాగే శాటిలైట్, ఆడియో, డిజిటల్ హక్కుల రూపంలో 10 కోట్ల రూపాయలు కనీసం వస్తాయని, ఈ లెక్కన ఎలా చూసిన ఈ సినిమా నిర్మాతలకు లాభదాయకమే అని నష్టాలూ వచ్చే అవకాశం ఏమాత్రం లేదని ప్రచారం జరుగుతుంది.
లేబుళ్లు: balayya, Puri jagganath


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్