10, మార్చి 2017, శుక్రవారం

బాహుబలితో పాటు ప్రభాస్ తదుపరి సినిమా టీజర్


వచ్చే నెల చివరిలో బాహుబలి2 సినిమాని విడుదల చేయనున్న ప్రభాస్ ఈలోపు తన తదుపరి సినిమాని అరంభించనున్నాడు. రన్ రాజా రన్ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా మొదలుకానున్నది. ఈనెలలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్నది. బాహుబలి పాత్రకోసం పెరిగిన వెయిట్ ని తగ్గించుకునే పనిలో ఉన్నాడు ప్రభాస్.

సుజిత్ తో కొత్త సినిమాని ఈ నెలలో ప్రారంభించనున్నారు. హీరోయిన్ ఫైనల్ కాకపోయినా అనుకున్న స్థాయిలో ప్రభాస్ ఇంకా వెయిట్ తగ్గకపోయినా...సినిమాని ఆరంభించడం వెనుక ఓ కారణం ఉన్నది. మొదట ప్రభాస్ పై కొన్ని కీలక సనివేశాలని రూపొందించాలని అనుకుంటున్నాడట దర్శకుడు సుజిత్. ఓ టీజర్ ని కట్ చేసి అవసరమైన మేర మాత్రమే షూట్ చేస్తారట.

బాహుబలి 2 విడుదల నాటికి దీన్ని సిద్దం చేసి, బాహుబలి పార్ట్ 2కి దీన్ని జత చేయాలనీ భావిస్తున్నాడని తెలుస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ని ఆయా భాషల్లో బాహుబలి2 సినిమాకి జత చేస్తారట. అందుకే ఈనెలలోనే షూటింగ్ ప్రారంభించనున్నారని టాక్.

లేబుళ్లు: , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్