సోషల్ మీడియా లో రామ్ చరణ్ పై సైటెర్లు వేస్తున్నా తారక్ అభిమానులు..
టాలీవుడ్ లో అటు నందమూరీ, ఇటు మెగా ఫ్యామిలీ ఈ రెణ్దిటి మధ్యా విపరీతమైన పోటీ ఉంటుంది, ఇక వీరి ఫ్యాన్స్ లో అయితే కొన్ని సార్లు శతృవులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే పవన్, జూనియర్ అభిమానుల మధ్య గొడవ హత్య వరకూ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఒక హీరో ఫ్యాన్స్ కాస్తా మరో హీరోకి యాంటీ ఫ్యాన్స్ గా మారిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే దాదాపుగా గత ముప్పై ఏళ్లుగా నందమూరి వర్సస్ మెగా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే….
అయితే ఆది కాస్త ఇప్పుడు ముదిరి పాకాన పడినట్లుంది….ఆన్‌లైన్ లో రాబోయే రామ్ చరన్ కొత్త సినిమా స్టిల్స్ ఎన్టీఆర్ ని కాపీ కొట్టినవే అంటూ గోల గోల చేస్తున్నారు ఆ ఇరు హీరోల అభిమానులు… కండలు తిరిగిన శరీరంతో చరణ్ ఒక బీచ్ పక్కన జీన్ ప్యాంట్ వేసుకుని నడుస్తున్న స్టిల్ చూస్తూ ఉంటె ‘టెంపర్’ సినిమాలో ఇటువంటి సిక్స్ ప్యాక్ తో షర్టు లేకుండా జూనియర్ కూడ జీన్ ప్యాంట్ తో బీచ్ పక్కన నడుస్తూ వెళ్ళిన సీన్ గుర్తుకు వస్తోంది అంటూ ‘టెంపర్’ సినిమాలోని ఆ సీన్ ను అంత ఘోరంగా చరణ్ కాపీ కొడితే ఎలా అంటూ జూనియర్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు చరణ్ జూనియర్లు ఎంత స్నేహితులైనా అంత ఘోరంగా చరణ్ జూనియర్ ను అనుసరిస్తాడా ? అంటూ సెటైర్లు వేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్.


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్