5, డిసెంబర్ 2016, సోమవారం

అమ్మ చనిపోయిందంటూ పుకార్లు

అమ్మ చనిపోయిందంటూ పుకార్లు


అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు కలకలం రేపాయి. పార్టీ కార్యాలయంపై జెండా కిందికి దించేయటం, లోకల్ మీడియా తప్పుడు కథనాలతో ఒక్కసారిగా అలజడి రేగింది. జాతీయ మీడియాలు సైతం అమ్మ చనిపోయిందంటూ కథనాలు రాసేశాయి.

దీంతో రంగంలోకి దిగిన అపోలో సిబ్బంది అదంతా అబద్ధం అంటూ మరో బులిటెన్ ను, ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపిన వైద్య బృందం,  నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు అందులో తెలిపింది. మీడియాలో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధం అంటూ పేర్కొంది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్