5, డిసెంబర్ 2016, సోమవారం

ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కృష్ణవంశి….!


డైరెక్టర్ కృష్ణవంశీ… క్రియేటివిటీకి మారుపేరు. ఈ పేరుతోనే సినీ ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు. అలాంటి కృష్ణవంశీ చేసిన సినిమాలు లేటుగానైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దీనికి ‘మురారి’, ‘రాఖీ’ వంటి సినిమాలే చక్కని ఉదాహరణ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు కృష్ణవంశీ. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా, ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు, కృష్ణవంశీ దర్శకత్వానికి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే ఆ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ..‘రాఖీ సినిమాకు ఆయువుపట్టు లాంటిది క్లైమాక్స్‌లో ఉండే కోర్టు సీన్. ఆ సీన్ అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చెరుకో వర్షన్ రాసుకురమ్మని పరుచూరి బ్రదర్స్‌, ఉత్తేజ్‌కి చెప్పాను. అడిగినట్టుగానే ఇద్దరూ చెరో వర్షన్ రాసుకొచ్చారు. వారు ఇచ్చిన రెండింటినీ చూసి నేనో వర్షన్ తయారు చేసుకున్నాను. దాన్ని తారక్‌కు ఇచ్చాను. వాడు(ఎన్టీఆర్) దానిని తీసుకెళ్లి పది నిమిషాల్లో షాట్‌కు రెడీ అన్నాడు. వెంటనే సీన్ చేశాం.
చాలా పెద్ద డైలాగ్ అయినా కొంచెం కూడా తప్పుపోకుండా చెప్పేశాడు. ఆ సమయంలో ఫ్రేమ్‌లో కనిపించే సుహాసిని(సినిమాలో పోలీస్ క్యారెక్టర్) ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా ఎన్టీఆర్ గొప్పతనమే. ఎందుకంటే వాడో పని రాక్షసుడు. వాడి మెమోరి పవర్ సూపర్. ఎన్టీఆర్ కాకుండా మహేష్ బాబుకు కూడా మెమోరీ పవర్ బాగుంటుంది’ అని తన గతానుభవాలను గుర్తుచేసుకున్నారు.



లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్