షూటింగ్ లో సూపర్ స్టార్ కి గాయాలు
మే నెలలో ఒకసారి రజినీ అనారోగ్యానికి గురి కాగా.. ఏకంగా రెండు నెలల పాటు షూటింగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోసారి చెకప్ ల కోసం అక్టోబర్ లో దాదాపు రెండు వారాలకు పైగా 2.0 వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా షూటింగ్ స్పాట్ లోనే రజినీకాంత్ గాయపడ్డం.. సీరియస్ న్యూస్ అయిపోయింది. 2.0 షూటింగ్ లో భాగంగా ఓ కీలకమైన సీన్ తీస్తున్న సమయంలో.. రజినీ కుడి కాలికి తీవ్ర గాయమైందిట. వర్షం పడుతుండడంతో.. మెట్లపై నడుస్తున్న సమయంలో పడిపోయారట రజినీ.
అప్పటికప్పుడే సూపర్ స్టార్ ని హాస్పిటల్ కి తరలించినా.. అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోయారట రజినీకాంత్. ఇప్పటికే రజినీ కోసం ఉక్రెయిన్ సెట్ ను ఇండియాలో రీ క్రియేట్ చేసిన శంకర్ అండ్ టీం.. పాట షూటింగ్ కోసం రజినీ ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
లేబుళ్లు: Rajinikanth, Robo 2.0 Movie, Telugu news


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్