10, డిసెంబర్ 2016, శనివారం

అఖిల్ ఎంగేజ్ మెంట్ తో జామ్ అయిన ట్రాఫిక్ !


అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్ ల మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ నిన్నరాత్రి అత్యంత ఘనంగా బంజారాహిల్స్ లోని జివికె హౌస్ లో జరిగింది. మీడియాను దరికి రానివ్వకుండా ఈ కార్యక్రమం జరిగినా ఈ మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి.

ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ బంజారాహిల్స్ ప్రాంతంలో జరగడంతో దాదాపు గంట ట్రాఫిక్ జామ్ బంజారాహిల్స్ లోని జివికె హౌస్ ప్రాంతంలో జరిగింది. ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా వస్తున్నారు అని సమాచారం అందడంతో సాధారణ ప్రజానీకం అంతా జివికె హౌస్ వద్ద గుమిగూడడంతో ఆప్రాంతం అంతా జనంతో కిక్కిరిసి పోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరీ ముఖ్యంగా ఈ ఫంక్షన్ కు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడ వస్తున్నాడు అని వార్తలు రావడంతో ఇలా విపరీతంగా జనం వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి దాదాపు గంట సమయం పట్టింది అని తెలుస్తోంది.

టాలీవుడ్ సెలెబ్రెటీలతో పాటు అనేకమంది రాజకీయ నాయకులు పాల్గొన్న ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో అందరి దృష్టి అఖిల్ పై కన్నా ఇదే కార్యక్రమానికి వచ్చిన నాగచైతన్య సమంతల పై పడింది. చాల అందంగా మెడ్ ఫర్ ఈచ్ అదర్ లా మెరిసిన ఈజంట అఖిల్ ఎంగేజ్ మెంట్ లో పెద్ద హడావిడే చేసిందని వార్తలు వస్తున్నాయి. సాంప్రదాయ బద్ధంగా అఖిల్ నాగార్జునలు అచ్చ తెలుగు పంచకట్టుతో ఈ కార్యక్రమంలో మెరిసారు..


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్