పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఓ రేంజులో ఏసుకున్న ఝాన్సీ!
టాలీవుడ్‌లో ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కూడా వారు ఇలాగే గోల చేస్తే నాగబాబు వారికి మాంచి క్లాస్ పీకాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు అనుకునే లోపే మళ్ళీ సరైనోడు ఫంక్షన్‌లో గోల గోల చేశారు. దీంతో విసుగు చెందిన అల్లు అర్జున్ పవన్ గురించి మట్లాడను అంటూ ‘చెప్పను బ్రదర్’ అన్న విషయం ఎవరు మాత్రం మరిచిపోతారు లెండీ. ఇక సోషల్ మీడియాను వేదిక చేసుకుని పాపం బన్నీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు పవన్ ఫ్యాన్స్. చివరకు తనకు పవన్ అభిమానులంటే చాలా ఇష్టమని చెప్పక తప్పలేదు బన్నీకి. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కాస్త ఓవర్‌గానే చేస్తున్నట్లు కనిపించడం లేదు..!
వీరు కేవలం మెగా ఫంక్షన్స్‌లోనే కాకుండా ఎలాంటి ఫంక్షన్స్‌లోనైనా ఇలాగే చేస్తుండటంతో టాలీవుడ్ సెలబ్రిటీలకు చిరాకు తెప్పించేస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వంగవీటి ఆడియో లాంఛ్ చాలా నాటకీయంగా విజయవాడలో చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఇక్కడ కూడా పవన్ ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. అప్పటికే మాంచి కోపం మీద ఉన్న రాము ఇన్‌డైరెక్ట్‌గా వారిని ఏసుకున్నాడు. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. దీంతో ఆ ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఝాన్సీకి కోపం కట్టలు తెంచుకోవడంతో పవన్ ఫ్యాన్స్‌కు స్టేజీపై నుండే క్లాస్ పీకింది. తమ అభిమాన నటుడి కోసం అరవడం తప్పు కాదు.. కానీ ఎక్కడ పడితే అక్కడ అరవడం మాత్రం నిజంగానే మంచిది కాదని హెచ్చరిస్తున్నారు సినీ నిపుణులు. మరి ఈ విషయంపై పవన్ ఏమైనా మాట్లాడుతాడా అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
లేబుళ్లు: Anchor Jhansi, Pawan kalyan fans


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్