యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమజోరు మీదున్నాడు, హిట్స్ ఫ్లాఫ్స్ కి అతీతంగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఫుల్ బిజీగానే ఉంటున్న ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్ భావిస్తాడు. దానికి కారణం ఎన్టీఆర్ నటనాప్రతిభ. అందుకే మిగిలిన హీరోలతో పోల్చితే ఎన్టీఆర్ కి క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. వారంరోజుల్లో 4 సార్లు మొత్తంగా రోజుకి 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రికార్డు ఇప్పటివరకు ఒక్క బాహుబలికి మాత్రమె ఉంది…ఇప్పుడు జనతాగ్యారేజ్ కి ఆ రికార్డు వచ్చింది.
ఇక కలెక్షన్స్ పరంగా తన రేంజ్ సినిమా పడితే ఎలా ఆడుతుందో అని ఎదురుచూసినవారికి చుక్కలు చూపిస్తున్నాడు యంగ్ టైగర్. జనతాగ్యారేజ్ కలెక్షన్స్ చూసి టోటల్ టాలీవుడ్ షేక్ అవుతుంది ఇందుకే. ఈ రేంజ్ లో ఎప్పుడూ రేచ్చిపోని ఎన్టీఆర్ ఈసారి మాత్రం ఆకాశమే హద్దుగా చలరేగి 80 కోట్లవైపు చకచకా అడుగులు వేస్తున్నాడు.
లేబుళ్లు: Janatha Garage Running towards 80 crores
<< హోమ్