అక్కడ మాత్రం కబాలి విడుదల కావడం లేదు.
![]() |
| No Kabali release |
ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న కబాలి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చెన్నైలో వారం పాటు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని బెంగళూరు లో మూడు స్టార్ హోటల్స్ ఈ చిత్ర ప్రీమియర్ షో ను వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కానీ వారిని నిర్ణయాన్ని తీరస్కరించారు డిప్యూటీ కమిషనర్ వి.శంకర్. కర్ణాటక సినిమాస్ నిబంధనల ప్రకారం సినిమాని కేవలం థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే విడుదల చేయాలనే నిబంధన ఉండడం తో హోటల్స్‌లో సినిమా విడుదలకు అనుమతి నిరాకరించారు. దీంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారి డబ్బును తిరిగి ఇచ్చేస్తామని హోటల్ యాజమాన్యాలు తెలిపాయి.
లేబుళ్లు: No kabsli release in that Area


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్