బాలయ్య సినిమాలో హాలీవుడ్ నటుడు !
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా “గౌతమీపుత్ర శాతకర్ణి” తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గౌతమీపుత్ర.. కోసం దర్శకుడు క్రిష్ పక్కగా ప్లాన్ చేసుకొన్నాడు. తాజాగా గౌతమీపుత్రలో మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి చేరినట్టు సమాచారమ్. నాథన్ జోన్స్ అనే హాలీవుడ్ నటుడి గౌతమీపుత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రాయ్, మ్యాడ్ మ్యాక్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నాథన్ నటించాడు. గౌతమీపుత్రలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం ఆయన్నుతీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఇదే నిజమైతే.. గౌతమీపుత్రలో భీభత్సమైన యుద్ధం జరగడం ఖాయం. ఇదిలావుండగా.. గౌతమీపుత్ర.. ప్రస్తుతం జార్జియాలో షూటింగు జరుపుకుంటోంది. బాలయ్య సరసన శ్రియ నటించనుంది. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్.
లేబుళ్లు: Hollywood actor in balayya's 100th movie Gautami Putra satakarni

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్