7, జులై 2016, గురువారం

5 గంటల్లో టాలీవుడ్ నంబర్ 1 అయిన జనతాగ్యారేజ్(1.1mil-45k likes)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ హిస్టీరియా అంటే ఏంటో చేసి చూపించాడు.తన ఫాలోయింగ్ పెరిగింది అని అందరూ అంటుంటే విన్న ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫాలోయింగ్ పవర్ ఏంటో తెలుసుకునే రికార్డును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకు విడుదల అయిన ఏ సినిమా రికార్డును కూడా మిగిలించకుండా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటివరకు విడుదల అయిన సినిమాల్లో ఒకరోజులో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టీసర్ గా నాన్నకుప్రేమతో మరియు సర్దార్ గబ్బర్ సింగ్ లు ఆల్ మోస్ట్ 8.4 లక్షల వ్యూస్ తో తొలి ప్లేస్ ని పంచుకున్నాయి అని చెప్పొచ్చు.

కానీ ఇప్పుడు విడుదల అయిన జనతాగ్యారేజ్ టీసర్ కేవలం 5 గంటల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును సృష్టించింది. కేవలం 14 గంటల్లోనే 1.1 మిలియన్స్ కి పైగా వ్యూస్ మరియు 45 వేలకి పైగా లైక్స్ తో సంచలనం సృష్టించిన జనతాగ్యారేజ్ టాలీవుడ్ నంబర్ వన్ గా నిలవడమే కాకుండా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది. ఇప్పుడు అందరికళ్ళు తొలిరోజు టోటల్ గా ఎన్ని వ్యూస్ అస్తాయి అన్నదానిపైన పడింది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్