ఆ క్రేజ్ ఒక్క యంగ్ టైగర్ కి మాత్రమే చెల్లింది
టాలీవుడ్ లోనే కాకుండా అటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరు ఆ హీరో...? అనే ఆలోచన కూడా లేకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. విషయానికొస్తే..రీసెంట్ గా ఒక ప్రముఖ నేషనల్ మీడియా తారక్ పై ఒక సర్వే నిర్వహించగా, అందులో నమ్మలేని కొన్ని నిజాలు బయట పడ్డాయి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉండే సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ కంటే యంగ్ టైగర్ ఎందులోనూ తక్కువకాడనేదే అందులోని సారాంశం.
మరీ ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ అటు జపాన్, స్పెయిన్ లో షూటింగ్ జరుపుకోవడంతో మనోడికి అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోవడమే కాకుండా, అక్కడి అభిమానులు కేవలం ఎన్టీఆర్ ను చూడటానికి ఇండియా వచ్చారు కూడా. ఇదంతా గమనించిన నేషనల్ మీడియా సర్వే చెయ్యడానికి రంగంలోకి దిగింది. అందులో భాగంగానే సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి యూనివర్సల్ స్టార్ కు మన బుడ్డోడు ఏమాత్రం తీసిపోడని తేలింది. అటు నటన విషయంలో కానీ, క్రేజ్ విషయంలో కానీ తారక్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పకనే చెప్పింది నేషనల్ మీడియా.అందుకేనేమో ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి క్యూలో నిలబడుతున్నారు దర్శకనిర్మాతలు. ఏది ఏమైనా..ఒక లోకల్ హీరో గురించి నేషనల్ మీడియా ఇలా కథలు కథలుగా చెప్పడం, సర్వేలు నిర్వహించడం ఒక్క యంగ్ టైగర్ కి మాత్రమే చెల్లింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ముందు ఈ క్రేజ్ ఎంతవరకు వెళ్తుందో ఊహించుకోవదానికే కష్టంగా ఉంది.
లేబుళ్లు: Ntr


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్