ఎరేంజ్డ్ మ్యారేజ్ కే ఓటేసిందటగా..
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క మ్యారేజ్ ఎప్పుడూ హాట్ టాపికే. ఇదిగో పెళ్లి చేసేసుకుంటున్నారు.. ఈ సారి పక్కా అని ఎప్పటికప్పుడు న్యూస్ వినిపించడమే తప్ప వీళ్లు మాత్రం వాళ్ల వాళ్ల పెళ్లి కబర్ చెప్పరు. ఇక స్వీటీకైతే మీడియా బోల్డన్నీ సంబంధాలు అంటగట్టింది.. కొన్నిసార్లు పెళ్లికొడుకుని కూడా ఫిక్స్ చేసేసింది. అనుష్క మాత్రం అన్నింటికి నవ్వి ఊరుకోవడం.. నా పెళ్లికి నా కన్నా మీరు ఎక్కువ తొందర పడుతున్నారుగా అని జోక్స్ వేయడం తప్ప మేటర్ తేల్చట్లేదు.
అనుష్క హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లు అయిపోయింది. గ్లామర్.. పెర్ఫార్మెన్స్ లో తిరుగులేదు కాబట్టి ఇప్పటికీ ఏదో ఒక ఆఫర్ అందుకుంటూనే ఉంది. కానీ ఇంట్లో వాళ్లకి మాత్రం స్వీటీకి పెళ్లి చేసేయాలని ఆరాటంగానే ఉంది. అసలే గారాలపట్టి. హీరోయిన్ గా ఎంత టాప్ లో ఉంటే మాత్రం ఓ అయ్యా చేతిలో పెట్టాలని ఉండదా ఏంటి. ఉన్న ఒక్క కూతురు ఇలా సినిమాలకి అంకితమైపోతానంటే వాళ్లకి కూడా బెంగే కదా. పైగా అనుష్క 36లోకి వచ్చేసింది. అందుకే కూతురికి పెళ్లి కావాలని ఇప్పటికే చాలాసార్లు.. చాలారకాల పూజలు చేయించారు.
మరి లేట్ గా రియలైజ్ అయిందో. పేరెంట్స్ చేసిన పూజలు ఫలించాయో కానీ అనుష్క ఈ మధ్య పెళ్లి మీద సీరియస్ గానే ఫోకస్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఇండస్ట్రీకే చెందిన ఓ ప్రొడ్యూసర్ ని చేసుకోబోతుందనే వార్తలు హల్ చల్ చేశాయ్. అయితే ఇవన్నీ గాలి కబుర్లేనని అనుష్క పెళ్లి నిజమే కానీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని సన్నిహితులు అంటున్నారు. స్వీటీ అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటుందని పెళ్లికొడుకు వేట ఫైనలైతే 2017లో అనుష్క పెళ్లి గ్యారంటీ అంటున్నారు. మరి ఈ సారన్నా అనుష్క పెళ్లి వార్త నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
లేబుళ్లు: Anushka shetty


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్