11, నవంబర్ 2016, శుక్రవారం

ఇంకా మార్కెట్లోకి రాని రూ.500 నోట్లు


బ్యాంకుల్లో పెరగని డిపాజిట్లు 
తపాలా శాఖలోనూ అంతే.. 
జిల్లా అంతటా ఇదే పరిస్థితి 
వేచి చూసే ధోరణిలోనే బడా బాబులు 
సామాన్యులు బ్యాంకుల వద్ద బారులు 




పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లాలో రెండో రోజూ కనిపించింది. సరైన చిల్లర లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో బడాబాబులకంటే సామాన్యులే ఎక్కువగా బ్యాంకుల వద్ద కనిపించారు. బడాబాబులు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవాలనే ఆలోచనతో పలుదారులు వెతుకుతున్నారని నిపుణు లు చెబుతున్నారు. ఇతరుల పేరుతో కొద్ది కొద్ది మొత్తాలు డిపాజిట్‌ చేయడం, వారిపేర్లతో పాత నోట్లను నూతన నోట్లతో మార్పిడి చేసుకోవడం వంటి ప్రయత్నాల్లో ఉన్నారు. మార్కె ట్లో చిల్లర కొరత కారణంగా రవాణా శాఖ కార్యాలయాలు బోసి పోయాయి. గుంటూరు రవాణాశాఖ కార్యాలయం లో సాధారణంగా రోజూ జనంతో కళకళలాడుతుం టుంది. గురువారం కార్యాలయంలో పట్టుమని పది మంది కనిపించని పరిస్థితి నెలకుంది. ప్రజానీకం రెండో రోజు గురువారం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో పెద్దనోట్లను కండక్టర్లు చిల్లర లేదంటూ తీసుకోలేదు. పె ట్రోలు బంకులలో పెద్దనోట్ల మొత్తానికి సరిపడా వాహనాలలో పూర్తిగా ఆయిల్‌ను నింపారు. నోట్ల సమస్య తలెత్తడంతో సబ్‌రిజిష్ర్టారు కార్యాలయంలో మంచిరోజులైనప్పటికీ రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి.
తొలిసారి రూ.2వేల నోటును ముద్రించిన రిజర్వు బ్యాంక్‌ అం దుకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రజ లు పెదవి విరుస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో మార్కెట్లో చిల్లర కు తీవ్రమైన డిమాండ్‌ ఏర్పడింది. గురువారం బ్యాంకులు తెరవడంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లు ఇచ్చి కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లు తీసుకునేందుకు ఎగబడ్డారు. దాదాపు అన్ని బ్యాంకులు కిటకిటలాడాయి. బ్లాక్‌మనీ ఉన్న కొందరు వ్యాపారవేత్తలు వారి కంపెనీలో పని చేసే వారందరి అధార్‌ కార్డులు సేకరిస్తున్నట్లు తెలిసింది. వీటి ద్వారా ఎక్సేంజ్‌ పద్ధతిలో ఓ వ్యాపారవేత్త ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఒకే రోజు రూ.20 లక్షలు మార్పిడి చేసుకున్నాడన్న విషయం గుంటూరులో కలకలం రేపుతోంది. కొందరు బడా బ్లాక్‌ బాబులు తమకు తెలిసిన వారిని మీ అకౌంట్లో కొంత డబ్బు జమ చేసుకుని తరువాత తిరిగి ఇవ్వాలని కోరుతున్నా సామాన్యులు ఒప్పుకోవడం లేదు. డిపాజిట్లు రూ.2.5 లక్షలు దాటితే పన్ను కట్టాలి, రూ.50 వేలు దాటితే లెక్క చెప్పాలి అన్న విషయం ప్రచారం జరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు అకౌంట్లలో డిపాజిట్లు చేసుకోవడానికి అంగీకరించడం లేదు.

రుణం కట్టుకుంటాం ఇవ్వండి ..
బ్యాంకులకు బకాయిలున్న వారు రుణం కట్టుకుంటాం, మళ్లీ తిరిగి రుణం తీసుకుంటాం, అలా వచ్చిన దాంట్లో మీకు సగం ఇస్తాం అలా ఇష్టం అయితే మాకు డబ్బులు ఇవ్వండని కొందరు సామాన్య, మధ్య తరగతి వర్గాల వారు బ్లాక్‌ బాబులు, అవినీతి సొమ్ము సంపాదించిన వారితో బేరసారాలు సాగిస్తున్నారు. ఫైనాన్స కంపెనీలకు కట్టాల్సిన సొమ్ము, బంగారం తాకట్టులో నుంచి విడిపించుకోవడం ఇలా పలు రకాల మార్గాల్లో నల్ల డబ్బును వైట్‌గా చేయించుకునే పనిలో అవినీతి సొమ్మును దిగమింగిన మరి కొందరు ఉన్నారు.

బ్యాంకుల వద్ద పోలీసు భద్రత..
గురువారం నుంచి బ్యాంక్‌ల్లో నోట్లను మార్చుకునేందుకు పెద్దసంఖ్య లో ప్రజలు తరలిరానున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తోపులాట జరగకుండా పోలీసులు బ్యాంకుల్లోకి నోట్లు మార్చుకునేందుకు వచ్చిన వారిని పంపారు. ఒకరికి రూ.4 వేల నగదు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం ఇవ్వటంతో పెద్దఎత్తున నోట్లు మార్పిడి చేసుకునే ఆశావహులు నిరాశతో వెనుదిరిగారు. బ్యాంక్‌ ఉన్నతాధికారులు ప్రకటించినట్లుగా ఏ బ్యాంక్‌లో కూడా అదనపు కౌంటర్లు కనిపించలేదు. నగదు మార్పిడికి సంబంధించిన ప్రొఫార్మా కూడా అందుబాటులో ఉంచలేదు. నగదు మార్పిడికి ఆధార్‌ కార్డు తప్పనిసరంటూ షరతు విధించారు. పలు బ్యాం కులు సాయంత్రం నాలుగు గంటలకే మూసివేశారు. వివరాలు అడిగేందుకు వెళ్లినవారిపై బ్యాంక్‌ సిబ్బంది కసురుకోవడం కనిపించింది.

రెండో రోజు చిల్లర నోట్ల కోసం పాట్లు
శుక్రవారం నుంచి ఏటీఎంలు పని చేస్తాయని ఆర్‌బీఐ చెప్పినా జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.100, రూ.500 నోట్లు తీసుకునే సౌలభ్యం ఉంది. నూతనంగా ముద్రించిన ఐదు వందల నోట్లు ఇంకా జిల్లాకు రాలేదు. ఆర్‌బీఐ మాత్రం ఏటీఎంలలో రూ. 50 రూ.100 నోట్లు ఉంచి ఖాతాదారులకు సేవలందించాలని సూచించింది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇంకా ప్రారంభమైన దాఖలాలు లేవు.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్