10, నవంబర్ 2016, గురువారం

మాస్ కా బాప్..తారక్ ని ఆకట్టుకుంటున్నా సూర్య


ఎన్టీఆర్ ని ప్రతి ఒక్కరు మాస్ కా బాప్ అని అంటారు. ఎన్టీఆర్ మాస్ లో ఉన్నా క్రేజ్ మరే ఎ హీరో కి లోదు. ఎన్టీఆర్ లాగా యాక్షన్ సన్నీవేశాలు పండించగల నటుడు మరేవరు లేడు. యాక్షన్ సన్నీ వేశాల్లో ఎన్టీఆర్ పండించే యాక్షన్ మాములుగా ఉండదు. ఆది,సాంబ,నరసింహుడు,రాఖీ సినిమా లలో ఎన్టీఆర్ పండించినా ఎమోషన్స్ మరే హిరో పండించలేడు.. అదీ తారక్ సత్తా. తారక్ క్రేజ్

ఇలాంటి క్రేజ్ ప్రస్తుతానికి టాలీవుడ్ లో తారక్ కు మాత్రమే ఉంది. అదెలాంటి క్రేజ్ అంటే జనతా గ్యారేజ్ అనే సినిమాతో ఒక్కసారిగా సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ పరిచయం చేసి తర్వాత తను ఏ సినిమాను ఒప్పుకుంటాడా? అని అందరూ ఆరా తీసేంతగా.

అయితే ఎంతమంది టాప్ డైరెక్టర్స్ జూనియర్ వెంట పడుతున్నా తను అనుకున్న కథ దొరికే వరకూ ఎలాంటి సినిమాకు సైన్ చేసే ప్రసక్తే లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ కథంతా ఒక్కసారి పక్కనపెడితే… కోలీవుడ్ లో బాగా ఫ్యామస్ అయిన డైరెక్టర్ పేరు ఒకటి లేటెస్ట్ గా వినిపిస్తుంది. అదింకెవరో కాదు సింగం సిరీస్ తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తున్న కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు హరి.

ఈయన రెండు రోజుల క్రిందటే సూర్యతో తీసిన సింగం 3 టీజర్ ను వదిలాడు. ఇలా రిలీజ్ చేశాడో లేదో అప్పుడే దాన్ని 48 లక్షలకు పైగా వీక్షించారు. ఇప్పుడిదే పాయింట్ ను యంగ్ టైగర్ బాగా లైక్ చేస్తుందంట. పోలీస్ ఆఫీసర్ గెటప్స్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించడం ఇక్కడ హరి స్పెషల్ ఎట్రాక్షన్. తాను నటించిన జనతా గ్యారేజ్ టీజర్ కు ఎలాంటి స్పందన వచ్చిందో… సేం టు సేం అలాంటి రెస్పాన్సే ఈ హరి సినిమాకు రావటంతో తాజాగా ఎన్టీఆర్ లుక్ ఈ డైరెక్టర్ పై పడినట్లు చెప్తున్నారు టాలీవుడ్ సినీ వర్గం.

ఒకవేళ సెంటిమెంట్ కలిసొస్తే మళ్లీ టెంపర్ తర్వాత అలాంటి ఫుల్ లెంగ్త్ అండ్ పవర్ ఫుల్ సోషల్ మెస్సేజ్ తో పోలీస్ ఆఫీసర్ గా తారక్ ఇరగదీయటం ఖాయం అని చెప్తున్నారు క్రిటిక్స్.


లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్