9, నవంబర్ 2016, బుధవారం

భైరవ ద్వీపమే బాలయ్య వీణ పట్టారు..

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికి బోలెడన్ని హంగులు జతయిపోతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం.. ఏ మాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్ జరుగుతుండడంతో.. మూవీని మరింతగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్. అయితే.. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడనే చెప్పాలి. 
శాతకర్ణి సెట్స్ నుంచి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయింిచనా.. బాలయ్య కొత్త లుక్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు బాలకృష్ణ వీణ వాయిస్తున్న ఓ ఫోటో నెట్ లో హల్ చేస్తోంది. శాతకర్ణి చక్రవర్తి ఓ కోటలోని తోటలో విలాసంగా రిలాక్స్ అవుతూ వీణ వాయిస్తుంటే.. పక్కనే ఉన్న దర్శకుడు క్రిష్.. సలహాలు అందిస్తుంటాడు డైరెక్టర్ సంగతేమో కానీ.. ఈ వీణ పట్టుకున్న బాలయ్య ఫోటో చూసి.. నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

అప్పట్లో భైరవ ద్వీపంలో కూడా బాలకృష్ణ ఇలాగే వీణ పట్టుకుని పాట పాడేస్తాడు. ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అయిదో చూశాం. ఇఫ్పుడు బాలయ్య మరోసారి వీణ వాయించేసి.. భైరవద్వీపంకు మిచిన భారీ సక్సెస్ కొట్టేయాలని కోరుకుంటున్నారు అభిమానులు


లేబుళ్లు: , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్