“గూగుల్”లో టాప్ ప్లేస్ యంగ్ టైగర్ దే
టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న విషయం అందరికీ తెలిసిందే…2015 టెంపర్ రిలీజ్ కి ముందు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పూర్తీగా ఎన్టీఆర్ క్రేజ్ పవర్ మిగిలిన హీరోలకన్నా రెండు మెట్లు ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఈ లెక్కలు ఇప్పుడు అఫీషియల్ గా గూగుల్ కూడా అనౌన్స్ చేసేసింది.
2016కి గాను టాలీవుడ్ హీరోల్లో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనట. 100%లో సుమారు 40%మంది ఎన్టీఆర్ గురించి సెర్చ్ చేయగా తర్వాత మహేష్ 24%, పవన్ 23%, అల్లుఅర్జున్ 10% మిగిలిన హీరోలు 3% సెర్చ్ లను సొంతం చేసుకున్నారట
ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ గురించిన ఏ వార్తా అయినా నాన్నకుప్రేమతో రిలీజ్ నుండి వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం…ఆ క్రేజ్ అలా అలా పెరిగి ఇప్పుడు ఏకంగా గూగల్ సెర్చ్ లో టాలీవుడ్ టాప్ హీరో అయ్యేంతలా సాగింది ఎన్టీఆర్ క్రేజ్.
లేబుళ్లు: NTR Top Place in Google


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్