ఎన్టీఆర్ గుడి ఎక్కడుందో తెలుసా ?
తాజాగా చిత్తూరుకు చెందిన సీనియర్ ఎన్‌టీఆర్ వీరాభిమాని ఒకరు. ఎన్‌టీఆర్‌కు విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఓ గుడిని కూడా ఈయన నిర్మించి ఎన్టీఆర్‌పై తనకు ఉన్న అనంతాభిమానాన్ని చాటుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పీ. శ్రీనివాసులు అనే వ్యక్తి సీనియర్ ఎన్‌టీఆర్‌కు పెద్ద ఎత్తున గుడి కట్టించారు. ఆయన ధనవంతుడో, పారిశ్రామికవేత్తో కాదు ఓ వృద్ధుడు. తనకు ప్రభుత్వం నెలనెలా అందించే వృద్ధాప్య పింఛన్‌తోపాటు చిన్నపాటి బడ్డీ కొట్టే ఆధారం. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామంలో ఎన్‌టీఆర్‌కి టెంపుల్ కట్టాడు. అంతేకాదు, అక్కడ ఎన్‌టీఆర్ విగ్రహానికి పూజలు చేసేందుకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాడు. అయితే ఆర్థిక వనరులు ఎవరైనా సమకూరిస్తే ఎన్‌టీఆర్‌కు ప్రతి రోజు ఇక్కడ పూజలు అందేలా చేస్తానని చెపుతున్నాడు. మరి మనోడికి ఎవరైనా దాతలు సాయం చేస్తారేమో చూడాలి.
Like us on fb http://www.facebook.com/cinemaTelugu
లేబుళ్లు: Sr NTR Temple


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్