6, నవంబర్ 2016, ఆదివారం

షాకింగ్ చిన్నారి పెళ్ళికూతురి తో వ్యబిచారం ..!


షాకింగ్ చిన్నారి పెళ్ళికూతురి తో వ్యబిచారం ..!..ఈ న్యూస్ విని షాక్ అయ్యార ..అవును ఇది నిజమంటుంధి బాలివుడ్ ఇంతకి వివరాలలోకి వెళ్తే “నటించడానికి – పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను తప్ప – నన్ను నేను అమ్ముకోవడానికి రాలేదు.. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్… నీకు తెలీదు నేనెంతగా కుమిలిపోతున్నానో.. నువ్వు స్వార్థపరుడివి.. నా పేరును చెడగొట్టావు.. నా గురించి నా తల్లిదండ్రుల గురించి జనం చెడుగా మాట్లాడుకుంటున్నారు”… అంటూ ముంబైలోని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేసినట్టు ఈ ఫోన్ కాల్ ద్వారా తెలుస్తోందని వారిద్దరి మధ్య చివరిసారిగా ఫోన్లలో జరిగిన సంభాషణలివని తాజాగా “ముంబై మిర్రర్” వెల్లడించింది. సుమారు మూడు నిమిషాల నిడివున్న ఈ ఫోన్ సంభాషణలు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగినట్టు తెలిపింది.

కాగా ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసు ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించింది. దీంతో పాటు తాజాగా విడుదలయిన ఫోన్ సంభాషణలు మరిన్ని సంచలనాలు సృష్టిస్తోన్నాయి. ఈ విషయంలో వ్యభిచారం చేయమని ప్రత్యూషను రాహుల్ చాలా ఒత్తిడి చేశాడని ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపిస్తున్నారు. అలాగే ప్రత్యూష చివరిసారిగా రాహుల్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు “వ్యభిచారం” అనే పదం వాడిందని చెబుతున్నారు.

అయితే ఈ విషయాలపై రాహుల్ వాదన మరోలా ఉంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని.. ఇప్పుడు డబ్బుకోసమే ఆమె తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ చెబుతున్నాడు. ప్రత్యూషకు అవకాశాలు దొరకనప్పుడు తానే అండగా నిలిచానని చెప్పుకొస్తున్నాడు. కాగా ఆంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఏప్రిల్ 1న ఉరేసుకుని ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా ఈ ఫోన్ సంభాషణలతో కేసులో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్