11, నవంబర్ 2016, శుక్రవారం

ఎన్టీఆర్ ని “రియల్ స్టార్” అనేది అందుకే.!!


ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు క్రేజ్ ఉన్న హీరోల్లో ఎక్కువమంది తమ సినిమాల విడుదల సమయంలో తప్ప మిగతా సమయంలో మీడియాని పట్టించుకోరని అందరూ చెబుతుంటారు. కేవలం తమ సినిమాల విడుదల సమయంలో కానీ బయట జరిగే ఈవెంట్ లలో మాత్రమే పబ్లిసిటీకోసం తమను వాడుకుంటారని మీడియాలో ఎప్పటి నుండో కథనాలు ఉన్నాయి.

మొదట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే ఉండేవాడు. ఎప్పుడో కానీ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు. కానీ టెంపర్ నుండి తన పంథాను పూర్తిగా మార్చుకున్న ఎన్టీఆర్ మీడియాతో తరచుగా మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళతో స్నేహపూర్వక౦గా ఉంటున్నాడు. ఎన్టీఆర్ తన సినిమాల కోస౦ వాడుకుని తరువాత పట్టించుకోకుండా ఉండే వాడిని కాదని నిరూపించాడు.


తన 33 వ పుట్టినరోజు జపురుకున్న ఎన్టీఆర్ మీడియా సోదరులను అందరినీ పిలిచి వాళ్ళకి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ తర్వాత మీడియా మిత్రులకి జనతాగ్యారేజ్ ఘనవిజయం తర్వాత మరోసారి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడట. బయటికి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాని ఈ వ్యవహారం పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని ఎవ్వరు అనుకోకుండా సైలెంట్ గా చేసి రియల్ స్టార్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్