14, సెప్టెంబర్ 2016, బుధవారం

గూబ గుయ్‌మ‌నేలా కొట్టాం : క‌ల్యాణ్ రామ్‌



త‌మ్ముడి క‌ళ్లలో ఆనందం చూడ‌డం కంటే అన్నకు కావ‌ల్సింది ఏముంది? ఆ సంతోషాన్ని క‌ళ్లారా తేరి పార చూస్తున్నాడు క‌ల్యాణ్ రామ్‌. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ వంద కోట్లు కొట్టేసింది. ఎన్టీఆర్ సెంచ‌రీ కొడితే.. తానే కొట్టినంత సంబ‌ర ప‌డుతున్నాడు క‌ల్యాణ్ రామ్‌. జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ మీట్‌లో మాట్లాడిన క‌ల్యాణ్ రామ్ ఉద్వేగానికి గుర‌య్యాడు. ‘మా ఆక‌లిని తీర్చిన అభిమానులకు థాంక్స్‌’ అంటూ కృత‌జ్ఞత‌లు చెప్పాడు. ఇంకా క‌ల్యాణ్ రామ్ ఏమ‌న్నాడంటే…

”నా ఆక‌లి, నా త‌మ్ముడి ఆక‌లి తీర్చిన సినిమా ఇది. మూడేళ్లుగా ఇలాంటి సినిమా కోస‌మే ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు కొడ‌తామా? ఎప్పుడు కొడ‌తామా? అని నేనూ, త‌మ్ముడు మాట్లాడుకొనేవాళ్లం. నిజంగానే కొట్టాడు.. గూబ గుయ్ మ‌నేలా కొట్టాడు. ఎన్టీఆర్ కొడితే ఏ రేంజులో ఉంటుందో అభిమానులు చూపించారు. ఇంత‌మంచి సినిమా అందించిన కొర‌టాల శివ గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా విజ‌యం మా నాన్నగారి ష‌ష్టి పూర్తి కానుక అని త‌మ్ముడు చెప్పాడు. అది నిజం. ఈ విజ‌యం ఆయ‌న‌కే చెందుతుంది” అన్నాడు క‌ల్యాణ్‌రామ్.


లేబుళ్లు: