14, ఆగస్టు 2016, ఆదివారం

"జయయో జనతా" యూట్యూబ్ లో ఎన్టీఆర్ మ్యానియా



యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ ట్రైలర్ రిలీజ్ అయిన క్షణం నుండి పాత రికార్డుల దుమ్ము దులపడమే పనిగా పెట్టుకుని దూసుకుపోతుంది. ఎన్టీఆర్ కి ఈ మధ్య పెరిగిన సోషల్ మీడియా క్రేజ్ ఈ సినిమాతో బయటపడుతుంది.

నాన్నకుప్రేమతో ఈ క్రేజ్ ని టీసర్ అయితే జనతాగ్యారేజ్ ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. విడుదల అయిన 36 గంటల్లోనే జనతాగ్యారేజ్ ట్రైలర్ 2 మిలియన్ మార్క్ ని అందుకుని పాత రికార్డుల దుమ్ము దులిపేసింది. ఈ మధ్యకాలం తెలుగులో ఈ రేంజ్ లో వ్యూస్ తెచ్చుకున్న తొలి ట్రైలర్ ఇదే అని చెప్పొచ్చు.

ఇక సోషల్ మీడియాలో జనతాగ్యారేజ్ హ్యాష్ టాగ్ నాన్ స్టాప్ గా వారం రోజులుగా నేషనల్ లెవల్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ ట్రెండింగ్ మరింతగా పెరిగింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక సినిమా పోస్టర్-టీసర్-ట్రైలర్ అన్ని రికార్డులు ఎన్టీఆర్ పేరిటే ఉన్నాయి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.


Like us on Facebook

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్