14, ఆగస్టు 2016, ఆదివారం

ఒక సినిమా మొదటి 5 ర్యాంకులు జనతాగ్యారేజ్ రికార్డు



ఒక సినిమా మొదటి 5 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎప్పుడైనా చూశామా…ఒక క్లాస్ లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలో కేవలం 1 కి మాత్రమే మొదటి ర్యాంక్ వచ్చే చాన్స్ ఉంటుంది. కానీ సినిమా పరిశ్రమలో కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పొచ్చు.

ఆయా సీజన్ ని బట్టి కొన్ని సినిమాలు టాప్ ప్లేస్ ని కొట్టేస్తాయి. కానీ లేటెస్ట్ గా సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ లో టాలీవుడ్ తరుపున ట్రెండ్ అవుతున్న టాప్ 5 వీడియోలను గమనిస్తే అవన్నీ ఒక్క సినిమానే అంటే ఆశ్యర్యం కలిగించినా ఇదే నిజమని చెప్పొచ్చు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ట్రైలర్, ఎన్టీఆర్ స్పీచ్, మూడు వీడియో సాంగ్ టీసర్స్ అన్నీ ఒకేసారి టాప్ 5 ప్లేసులలో ట్రెండ్ అవుతున్నాయని యూట్యూబ్ ఇండియా తెలిపింది. దాంతో ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటే యూనిట్ ఈ క్రేజ్ ని చూసి సంతోషపడి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినందుకు సంతోషపడుతుంది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్